ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

boyfriend slits girlfriend throat - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : న్యూయార్క్‌లోని సిసిరోకు చెందిన బ్రాండన్‌ ఆండ్రీవ్‌ క్లార్క్‌ అనే 21 ఏళ్ల యువకుడు ఆదివారం ఉదయం తాను ప్రేమిస్తున్న ‘ఇన్‌స్టాగ్రామ్‌’ తార బియాంక డెవిన్స్‌ అనే 17 ఏళ్ల యువతి గొంతు కోసి హత్య చేశాడు. అచేతనంగా పడి ఉన్న డెవిన్స్‌ పక్కన ఆండ్రీవ్‌ క్లార్క్‌ సెల్వీలు దిగుతుండగా, పోలీసులు రంగప్రవేశం చేసి అతన్ని పట్టుకున్నారు. పోలీసులు క్లార్క్‌ తలకు నేరుగా తుపాకీ ఎక్కిపెట్టి ఉన్నప్పుడు క్లార్క్‌ తాను తీసిన డెవిన్స్‌ ఫొటోలను, డెవిన్స్‌తో తన ఫొటోలను సోషల్‌ మీడియా ‘ఇన్‌స్టాగ్రామ్‌’కు పంపించారని పోలీసులు తెలిపారు.

ఈ ఫొటోలు ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో 12 గంటలకుపైగా వైరలవడంతో నెత్తుటి మడుగులో పడి మరణించిన డెవిన్స్‌ పట్ల సానుభూతి పక్కన పెట్టి ఇన్‌స్టాగ్రామ్‌ యాజమాన్యంపై ఆగ్రహం పెల్లుబుకింది. తమ దష్టికి వచ్చిన తాము ఫొటోలను తొలగించామని ‘ఇన్‌స్టాగ్రామ్‌’ యాజమాన్యం వెల్లడించింది.‘ఐయాం సారి బియాంక’ అన్న వ్యాఖ్యతో ఆదివారం ఉదయం 6.40 సమయానికి డెవిన్స్‌ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్ష మయ్యాయి. ఆదివారం సాయంత్రం వరకు ఆ ఫొటోలు అలాగే వైరల్‌ అయ్యాయి. సోమవారం రాత్రి క్లార్క్‌పై న్యూయార్క్‌ పోలీసులు సెకండ్‌ డిగ్రీ హత్య కేసును నమోదు చేశారు. నేరం రుజువైతే క్లార్క్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.

నిందితుడు క్లార్క్‌ వివాదాస్పదమైన డార్క్‌ వెబ్‌సైట్‌ ‘4ఛాన్‌’ తరచు వీక్షించేవాడని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఇందులో అశ్లీల వీడియోల నుంచి ఉగ్రవాదుల వీడియోల వరకు వీడియోలు , వాటికి సంబంధించిన వార్తలు ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను మూసివేసినట్లు ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. మళ్లీ ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటుంది. బియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు పేజీల ద్వారా 35 వేల మంది అనుచరులను కలిగి ఉన్నారు. ‘4ఛాన్‌’ ప్రభావంతోనే క్లార్క్‌ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో సంచలనం రేకెత్తించేందుకే హత్య చేసి ఉంటారని యూజర్లు అభిప్రాయపడుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top