జ్యూస్‌ అనుకుని విషం తాగాడు..! | the boy dies after drinking Pest in Tamil Nadu | Sakshi
Sakshi News home page

జ్యూస్‌ అనుకుని విషం తాగాడు..!

Nov 4 2017 7:05 PM | Updated on Nov 4 2017 7:11 PM

the boy dies after drinking Pest in Tamil Nadu - Sakshi

సాక్షి, పళ్లిపట్టు : కుటుంబ సభ్యుల కోసం టీ తయారు చేస్తున్న ఓ బాలిక తెలిసి తెలియక అందులో పురుగుల మందు కలపడంతో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. బిహార్‌లో జరిగిన ఈ సంఘటన మరువక ముందే తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జ్యూస్‌ అనుకుని ఓ బాలుడు పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. 

వివరాలివి.. పళ్లిపట్టు మండలం కొళత్తూరు గ్రామ పంచాయతిలోని జయంతి కాలనీలో కార్మికుడు బాబు, లావణ్యలు నివశిస్తున్నారు. ఈ దంపతులకు భాను(7), కదిర్‌వేల్‌ అలియాస్‌ అఖిల్‌(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అఖిల్‌ శుక్రవారం ఇంటి సమీపంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో సమీపంలోని చెత్త కుప్పలో ఉన్న బాటిళ్లను చూశాడు. 

అందులో జ్యూస్‌ ఉంటుందని అనుకుని ఆ పురుగుల మందును తాగాడు. కాసేపటి తరువాత ఆ బాలుడు స్పృహ కోల్పోయాడు.  విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే పళ్లిపట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement