కుటుంబంలో వివాదం | Boy Died In Car Accident Prakasam | Sakshi
Sakshi News home page

కుటుంబంలో వివాదం

Nov 26 2018 1:44 PM | Updated on Jul 12 2019 3:02 PM

Boy Died In Car Accident Prakasam - Sakshi

విలపిస్తున్న బాలుడి కుటుంబ సభ్యులు

ప్రకాశం, కంభం: తల్లిదండ్రుల మధ్య వివాదం చోటుచేసుకున్న నేపథ్యంలో వారి ఐదేళ్ల పసిబాలుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం దర్గా గ్రామంలో జరిగింది. వివరాలు.. మండలంలోని దర్గా గ్రామానికి చెందిన పెద్ద బ్రహ్మయ్య, అతని భార్య యశోధల మధ్య ఓ వివాదం జరిగింది. కుటుంబ సభ్యులు, పిల్లలు, బంధువులతో కలిసి దంపతులు స్థానిక పోలీసుస్టేషన్‌కు వచ్చారు. పోలీసుస్టేషన్‌ వద్ద ఉన్న సమయంలో పిల్లలు కొనుక్కునేందుకు హైవే అవతలి వైపునకు వెళ్తుండగా అదే సమయంలో మార్కాపురం నుంచి కంభం వైపు వస్తున్న కారు బాలుడిని ఢీకొట్టడంతో  యువరాజ్‌ (5) అనే బాలుడు ఎగిరి కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి.

పాపం పసికందు
తల్లిదండ్రుల తప్పిదానికి పోలీసుస్టేషన్‌ వరకు వారితో కలిసి వచ్చిన పసికందు రోడ్డుపైకి వెళ్లి ప్రమదానికి గురయ్యాడు. వెంటనే బాలుడిని వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించండంతో ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందడంతో తిరిగి కంభం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. ముగ్గురు పిల్లల్లో ఓ కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు మృతదేహం వద్ద భోరున విలపిస్తున్నారు. ఏఎస్‌ఐ రంగస్వామి వైద్యశాల వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు.

పోలీసుల అదుపులో నిందితుడు?
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. కారును పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement