యూపీ బార్‌ కౌన్సిల్‌ చీఫ్‌ కాల్చివేత | UP Bar Council Chief Shot Dead In Agra | Sakshi
Sakshi News home page

తోటి న్యాయవాది ఘాతుకం; లాయర్‌ కాల్చివేత

Jun 12 2019 5:38 PM | Updated on Jun 12 2019 5:41 PM

UP Bar Council Chief Shot Dead In Agra - Sakshi

అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన న్యాయవాది మనీష్‌ శర్మ తుపాకీతో ఆమెపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు.

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలు దార్వేష్‌ యాదవ్‌ను ఓ అడ్వకేట్‌ తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వివరాలు.. రెండు రోజుల క్రితం జరిగిన బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో దార్వేష్‌ యాదవ్‌ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో బుధవారం ఆమె ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. దీంతో ఈరోజు మధ్యాహ్నం ఆగ్రాలోని కోర్టుకు చేరుకుని.. తోటి న్యాయవాదులతో ముచ్చటిస్తున్నారు.

ఈ క్రమంలో అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన న్యాయవాది మనీష్‌ శర్మ తుపాకీతో ఆమెపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. కాగా వీరిద్దరికి చాలా ఏళ్ల నుంచే పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మనీష్‌ను ఆస్పత్రిలో చేర్పించామని..అతడి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. శర్మ తన లైసెన్సెడ్‌ గన్‌తో ఈ ఘటనకు పాల్పడ్డాడని..ఇందుకు గల కారణాల గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement