రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి మృతి   | B Tech Student Dies In Road Accident Rangareddy | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి మృతి  

Jan 4 2019 12:38 PM | Updated on Jan 4 2019 12:38 PM

B Tech Student Dies In Road Accident Rangareddy - Sakshi

ప్రవీణ్‌ మృతదేహం

అత్తాపూర్‌: రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి దుర్మరణం చెంది న సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్ర నగర్‌ గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌ (22) బీటెక్‌ విద్యార్ధి. గురువారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి పయనమయ్యాడు. హిమాయత్‌సాగర్‌ సౌడమ్మ రహదారి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్‌ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

సమాచారం అందుకున్న ప్రవీణ్‌ కుటుంబీకులు వెంటనే ఘట నా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. ముగ్గురు ఆడపిల్లల తరువాత జన్మించిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement