ఢిల్లీలో ఏపీ విద్యార్థి ఆత్మహత్య | AP Student Committed Suicide In Delhi | Sakshi
Sakshi News home page

Dec 3 2018 12:36 PM | Updated on Dec 3 2018 5:17 PM

AP Student Committed Suicide In Delhi - Sakshi

దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఏపీకి చెందిన నల్లి హేమంత్‌ కుమార్‌ ఆదివారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని వద్ద నుంచి పోలీసులు సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఫీజు కోసం కళాశాల యాజమాన్యం, లెక్చరర్ల వేధింపులు తాళలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు హేమంత్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement