breaking news
lying under the train
-
ఢిల్లీలో ఏపీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఏపీకి చెందిన నల్లి హేమంత్ కుమార్ ఆదివారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని వద్ద నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఫీజు కోసం కళాశాల యాజమాన్యం, లెక్చరర్ల వేధింపులు తాళలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు హేమంత్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తాగునీటి కోసం రైలు దిగి...
- రైలు కింద పడి మహిళ మృతి గూడూరు టౌన్: తాగునీటి కోసం ఫ్లాట్‌ఫాంపై దిగిన ఓ మహిళ తిరిగి ఎక్కే సమయంలో రైలు కదలడంతో అదుపుతప్పి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గూడూరు రైల్వేస్టేషన్లో గురువారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు..పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యాగూడేనికి చెందిన చిన్నం హేమలత(57) దీపావళి సందర్భంగా చెన్నైలో ఉంటున్న కుమార్తె ధనలక్ష్మి, మనుమరాలితో కలిసి గుజరాత్‌లోని ఉంటున్న భర్త గాంధీ వద్దకు వెళ్లింది. అనంతరం కుమార్తె, మనుమరాలిని చెన్నైలో వదిలిపెట్టేందుకు నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో వెళుతోంది. ఈ క్రమంలో రైలు గూడూరు రైల్వేస్టేషన్లో ఆగడంతో మంచినీటి కోసం హేమలత దిగింది. నీళ్లు పట్టుకుని తిరిగి ఎక్కే సమయంలో రైలు కదలడంతో దాని కిందపడే కన్నుమూసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రైల్వే ఎస్సై వరప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.