కొత్తగూడం వద్ద ప్రమాదం..ముగ్గురి మృతి | accident at abdullapurmet..3 dead | Sakshi
Sakshi News home page

కొత్తగూడం వద్ద ప్రమాదం..ముగ్గురి మృతి

Feb 26 2018 8:01 AM | Updated on Apr 3 2019 8:03 PM

accident at abdullapurmet..3 dead - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రంగారెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్ మేట్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తగూడం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  పోచంపల్లి నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారు(AP 09 AK 0060)ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్‌లోని రామాంతపురానికి చెందిన పద్మ, స్వప్న, మణికాంత్‌లుగా గుర్తించారు.

మృతులు, బాధితులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం  దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement