ఆరుషి కేసులో కొత్త మలుపు | Aarushi Murder Case SC Admits Hemraj Wife Plea  | Sakshi
Sakshi News home page

ఆరుషి కేసులో కొత్త మలుపు

Mar 19 2018 6:03 PM | Updated on Sep 2 2018 5:20 PM

Aarushi Murder Case SC Admits Hemraj Wife Plea  - Sakshi

తల్వార్‌ దంపతులు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి జంట హత్యల కేసు మరో కొత్త మలుపు తిరిగింది. తల్వార్‌ దంపతులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ వచ్చిన అప్పీల్‌ను సోమవారం సుప్రీంకోర్టు స్వీకరించింది. పని మనిషి  హేమ్‌రాజ్‌ భార్య కుంకాల బంజాడే ఈ కేసుపై పునర్విచారణ చేపట్టాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్‌ రంజన్‌ గోగయ్‌ నేతృత్వంలోని బెంచ్‌.. తల్వార్‌ దంపతులకు నోటీసులు జారీ చేసింది. 

2008లో దంత వైద్యులైన రాజేశ్, నూపుర్ తల్వార్‌ దంపతుల కుమార్తె ఆరుషి, వాళ్ల ఇంట్లో పని మనిషి హేమరాజ్‌లు హత్యకు గరైయ్యారు.  ఈ కేసులో ఘజియాబాద్‌ కోర్టు తల్వార్‌ దంపతులను దోషులుగా తేలుస్తూ 2013లో యావజ్జీవ శిక్ష విధించింది. అయితే  సరైన సాక్ష్యాలు లేని కారణంగా  ఆరుషి తల్లిదండ్రులను అలహాబాద్‌ కోర్టు నిర్దోషులుగా  తేలుస్తూ 2017లో తీర్పు వెలువరించింది. 


 

Advertisement
 
Advertisement
Advertisement