50 మంది ఉగ్రవాదుల లొంగుబాటు | 50 militants surrender in Afghanistan | Sakshi
Sakshi News home page

50 మంది ఉగ్రవాదుల లొంగుబాటు

Aug 12 2018 2:54 PM | Updated on Mar 28 2019 6:10 PM

50 militants surrender in Afghanistan  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బాడ్ఘిస్‌ ప్రావిన్స్‌లో ఆదివారం 50 ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ అధికారుల ఎదుట లొంగియారు.

కాబూల్‌: బాడ్ఘిస్‌ ప్రావిన్స్‌లో ఆదివారం 50 ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ అధికారుల ఎదుట లొంగియారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారులు ధృవీకరించారు. లొంగిపోయిన వారిలో తాలిబన్‌ కీలక కమాండర్‌ ముల్లా తూపాన్‌ కూడా ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ముల్లా తూపాన్‌ సుమారు 300 మంది ఉగ్రవాదులను పెంచిపోషించాడు. ముల్లా తూపాన్‌ లొంగుబాటు బాడ్ఘిస్‌ ప్రావిన్స్‌తో పాటు పక్కనున్న ప్రాంతాల్లో కూడా తాలిబన్‌కు కోలుకోని దెబ్బ అని అధికారులు చెబుతున్నారు. ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement