తోటి వాళ్లంతా పని చేస్తున్నారు.. నీవు మాత్రం ! | 21 Years Young Man Commits Suicide In Chennur | Sakshi
Sakshi News home page

గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య

Mar 9 2020 7:55 AM | Updated on Mar 9 2020 7:55 AM

21 Years Young Man Commits Suicide In Chennur - Sakshi

రాజశేఖర్‌(ఫైల్‌)

సాక్షి, జైపూర్‌(ఆదిలాబాద్‌) : జైపూర్‌ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన సౌదాని రాజశేఖర్‌(21)అనే యువకుడు తండ్రి మందలించాడని మనస్తాపానికి గురై గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదనపు ఎస్సై గంగరాజాగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం..టేకుమట్లకు చెందిన లీల–మల్లేశ్‌ దంపతుల కుమారుడు రాజశేఖర్‌ డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. రాజశేఖర్‌కు దేవుడి పూనకం రావడం.. తోటి వాళ్లు పని చేస్తున్నారు నీవు పని లేకుండా ఖాళీగా ఉంటున్నావు అని తండ్రి మల్లేశ్‌ ఈనెల 6న ఇంట్లో మందలించాడు. (గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా)

దీంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్‌ ఇంట్లో నుంచి వెళ్లిపోయి టేకుమట్ల సమీపంలో గోదావరి నదిలో దూకాడు. మూడు రోజులకి మృతదేహం టేకుమట్ల గోదావరి ఒడ్డుకు చేరుకోవడం స్థానికులు గమనించి పోలీసులు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని అదనపు ఎస్సై గంగరాజాగౌడ్‌ పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  (దారుణం: ఆగిన లిఫ్టు.. ఆ సమయంలో..)

Advertisement
 
Advertisement
Advertisement