314 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ దూకుడు! | Sensex surges 314 points; capital goods, banking stocks gain | Sakshi
Sakshi News home page

314 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ దూకుడు!

Jun 30 2014 4:00 PM | Updated on Sep 2 2017 9:36 AM

314 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ దూకుడు!

314 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ దూకుడు!

కాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సోమవారం భారీ లాభాల్ని సాధించాయి

హైదరాబాద్: కాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సోమవారం భారీ లాభాల్ని సాధించాయి. క్రితం ముగింపుకు ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 313 పాయింట్ల లాభంతో 25413 పాయింట్ల వద్ద, నిఫ్టీ 102 పాయింట్ల వృద్ధితో 7611 వద్ద ముగిసింది. 
 
సూచీ అధారిత కంపెనీ షేర్లలో బీపీసీఎల్ అత్యధికంగా 5.39 శాతం లాభపడగా, ఐడీఎఫ్ సీ 5.26, పీఎన్ బీ 4.28, సన్ ఫార్మా 4.10, టాటా పవర్ 3.85 శాతం వృద్దిని సాధించాయి. 
 
యునైటైడ్ స్పిరిట్స్, మారుతి సుజుకి, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, అల్ట్రా టెక్ సిమెంట్స్ స్వల్పంగా నష్టపోయాయి. 

Advertisement
 
Advertisement
Advertisement