సెన్సెక్స్ కు 135 పాయింట్ల నష్టం! | Sensex slips 135 points; oil and gas stocks dip | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ కు 135 పాయింట్ల నష్టం!

Jul 28 2014 3:41 PM | Updated on Sep 2 2017 11:01 AM

సెన్సెక్స్ కు 135 పాయింట్ల నష్టం!

సెన్సెక్స్ కు 135 పాయింట్ల నష్టం!

భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సోమవారం నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 135 పాయింట్ల నష్టంతో 25991, నిఫ్టీ 41 పాయింట్లు క్షీణించి 7748 వద్ద ముగిసాయి.

హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సోమవారం నష్టాలతో ముగిసాయి.  సెన్సెక్స్ 135 పాయింట్ల నష్టంతో 25991, నిఫ్టీ 41 పాయింట్లు క్షీణించి 7748 వద్ద ముగిసాయి. 
 
ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26,181 గరిష్టాన్ని, 25,900 పాయింట్ల కనిష్టాన్ని తాకగా, నిఫ్టీ 7,799 గరిష్ట స్థాయిని 7,722 కనిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. 
 
హెచ్ యూఎల్, హెచ్ సీఎల్ టెక్, పీఎన్ బీ, కెయిర్న్ ఇండియా, సన్ ఫార్మా కంపెనీలు స్వల్ప లాభాల్ని నమోదు చేసుకోన్నాయి. 
 
డీఎల్ఎఫ్  అత్యధికంగా 5.23 శాతం నష్టపోగా, కోల్ ఇండియా 3.18, అల్ట్రా టెక్ సిమెంట్స్, ఏసీసీ, బీపీసీఎల్ కంపెనీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement