లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్! | Sensex gains on Asian cues | Sakshi
Sakshi News home page

లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్!

Aug 4 2014 1:10 PM | Updated on Sep 2 2017 11:22 AM

లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్!

లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్!

మంగళవారం రిజర్వు బ్యాంకు కీలక త్రైమాసిక సమీక్ష చేపట్టనున్నందున ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

గ్లోబల్ మార్కెట్లలో సానుకూల పవనాలు, రిటైల్ ఇన్వెస్టర్ల, ఫండ్ మేనేజర్లు కోనుగోళ్లకు మొగ్గు చూపడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. క్రితం ముగింపుకు సెన్సెక్స్ 151 పాయింట్ల లాభంతో 25630 వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల వృద్ధితో 7656 వద్ద ముగిసాయి. 
 
మంగళవారం రిజర్వు బ్యాంకు కీలక త్రైమాసిక సమీక్ష చేపట్టనున్నందున ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఇన్పోసిస్ అత్యధికంగా 3.30 శాతం లాభపడగా, యునైటెడ్ స్పిరిట్, హెచ్ సీఎల్ టెక్, ఎన్ ఎమ్ డీసీ, టెక్ మహీంద్ర కంపెనీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. 
 
హెచ్ డీఎఫ్ సీ, డీఎల్ఎఫ్, కోల్ ఇండియా, సిప్లా, భారతీ ఎయిర్ టెల్ కంపెనీలు స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement