వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో.. | Sensex drops 96 pts | Sakshi
Sakshi News home page

వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో..

Jun 20 2014 4:03 PM | Updated on Sep 2 2017 9:07 AM

వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో..

వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో..

ఇరాక్ లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా మూడో రోజు నష్టాలతో ముగిసాయి.

ఇరాక్ లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా మూడో రోజు నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో నిన్నటి ముగింపుకు సెన్సెక్స్  96 పాయింట్ల కోల్పోయి  25105 వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు క్షీణించి 7511 వద్ద ముగిసింది. 
 
ఎంఅండ్ఎం అత్యధికంగా 2.73 శాతం, టాటా పవర్ 2.69, హిండాల్కో 2.35, బీపీసీఎల్ 2.11, ఎన్ ఎమ్ డీసీ 1.98 శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. యునైటెడ్ స్పిరిట్స్ అత్యధికంగా 3.04, కెయిర్న్ ఇండియా 1.39 శాతం, యాక్సీస్ బ్యాంక్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ స్వల్పంగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement