స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ | Sensex closes in red; IT stocks fall | Sakshi
Sakshi News home page

స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్

Aug 7 2014 4:18 PM | Updated on Sep 2 2017 11:32 AM

స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్

స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్

గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, ఐటీ కంపెనీ షేర్లు భారీగా క్షీణించడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి

గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, ఐటీ కంపెనీ షేర్లు భారీగా క్షీణించడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్ 76 పాయింట్ల నష్టంతో 25589 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు క్షీణించి 7649 వద్ద ముగిసాయి. 
 
ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్  25,778 -25,526, నిఫ్టీ 7,708 - 7,630 గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య ఊగిసలాటకు గురైంది. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఏసీసీ, జిందాల్ స్టీల్, అంబుజా సిమెంట్స్, టాటా స్టీల్, కోల్ ఇండియా కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. 
 
పీఎన్ బీ, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టీసీఎస్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement