రికార్డు కనిష్టానికి రూపాయి | Rupee near 72/USD; trades at 2019 low | Sakshi
Sakshi News home page

రికార్డు కనిష్టానికి రూపాయి

Aug 22 2019 3:02 PM | Updated on Aug 22 2019 3:02 PM

Rupee near 72/USD; trades at 2019 low - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత కొనసాగుతోంది.  డాలరు మారకంలో ఆరంభంలోనే 17పైసలు నష్టపోయిన రూపాయి మిడ్‌ సెషన్‌ తరువాత ఈ ఏడాదిలో అత్యంత కనిష్టాన్ని నమోదు చేసింది. 37 పైసలు నష్టపోయి 71.92  స్థాయికి చేరింది. ప్రస్తుతం 71.97 వద్ద కొనసాగుతూ రూపాయి 72 స్థాయి దిశగా కదులుతోంది.  ఇతర  కరెన్సీలతో  పోలిస్తే డాలరు బలం, చములు ధరల క్షీణత, దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం రూపాయ రికార్డు పతనానికి కారణమని ట్రేడరు చెబుతున్నారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు 440 పాయింట్లకు పైగా కుదేలయ్యాయి. బ్యాంకింగ్‌, ఆటో, రియల్టీ షేర్లలో అమ్మకాలుకొనసాగుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement