ఈసీఐఎల్‌కు రూ.68కోట్ల లాభం | profit of Rs 68 crore to ECIL | Sakshi
Sakshi News home page

ఈసీఐఎల్‌కు రూ.68కోట్ల లాభం

Oct 29 2014 12:56 AM | Updated on Sep 2 2017 3:30 PM

ఈసీఐఎల్‌కు రూ.68కోట్ల లాభం

ఈసీఐఎల్‌కు రూ.68కోట్ల లాభం

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,456కోట్ల టర్నోవర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,456కోట్ల టర్నోవర్ సాధించినట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈమేరకు సంస్థ రూ.68కోట్ల లాభం ఆర్జించిందని, గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది రూ.31కోట్లు (120శాతం)అధికమని పేర్కొన్నారు. ఆదాయపన్ను చెల్లింపు తర్వాత సంస్థ నికర లాభం రూ.47కోట్లుగా తేలిందని, ఈ డివిడెండ్ మొత్తాన్ని మంగళవారం ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈసీఐఎల్ సీఎండీ పి.సుధాకర్, డెరైక్టర్లు విఎస్‌బి బాబు, కిషోర్ రుంగ్తా తదితరులు భారత ప్రభుత్వ కార్యదర్శి, అణు ఇంధన కమిషన్ చైర్మన్ ఆర్.కె.సిన్హాకు చెక్కు రూపంలో అందజేసినట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement