సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ మెంబర్లకు పాలసీ  | Policy to the Supreme Court Bar Associations | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ మెంబర్లకు పాలసీ 

Sep 28 2018 1:19 AM | Updated on Sep 28 2018 1:19 AM

Policy to the Supreme Court Bar Associations - Sakshi

ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజమైన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) సుప్రీం కోర్టు బార్‌ అసోసి యేషన్‌ (ఎస్‌సీబీఏ) సభ్యులకు గ్రూపు పాలసీని ప్రారంభించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దీపక్‌ మిశ్రా చేతుల మీదుగా ఈ పాలసీ విడు దలైంది. పాలసీలోని సభ్యులకు రూ.20 లక్షల కవరేజీ ఉంటుందని, 64 ఏళ్ల వయస్సులోపు ఎస్‌సీబీఏ మెంబర్లు పాలసీకి అర్హులని వెల్లడించింది.

ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా మాట్లాడుతూ.. ‘క్లైమ్‌ల పరిష్కారంలో ఎల్‌ఐసీ కచ్చితత్వం పాటిస్తుంది. సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యులకు గ్రూప్‌ పాలసీ ఏర్పాటుచేసిన విధంగా జిల్లాలు, ఇతర స్థాయిల్లోని బార్‌ అసోసియేషన్‌ సభ్యులకు కూడా ఎల్‌ఐసీ గ్రూప్‌ పాలసీలను అందించాల్సిన అవసరం ఉంది.’ అని వ్యాఖ్యానించారు.  

Advertisement
 
Advertisement
Advertisement