రికార్డులకు బ్రేక్‌: నష్టాల్లో మార్కెట్లు | Markets edge lower: Sensex down 38 points | Sakshi
Sakshi News home page

రికార్డులకు బ్రేక్‌: నష్టాల్లో మార్కెట్లు

Oct 31 2017 9:29 AM | Updated on Oct 31 2017 9:35 AM

Markets edge lower: Sensex down 38 points

ముంబై : నాలుగు రోజుల నుంచి రికార్డుల మోతతో దంచికొట్టిన స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో కిందకి పడిపోయాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ పాల్పడటంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 38.08 పాయింట్ల నష్టంలో 33,228 వద్ద, నిఫ్టీ 13.35 పాయింట్ల నష్టంలో 10,350 వద్ద ట్రేడవుతున్నాయి.

బైబ్యాక్‌ అనంతరం టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ 2 శాతం మేర పడిపోయింది. ఇన్ఫోసిస్‌తో పాటు ఐసీఐసీఐ బ్యాంకు, గెయిల్‌, కోల్‌ ఇండియా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, సన్‌ఫార్మా, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీలు నష్టాలు గడించాయి. ఎస్‌బీఐ, ఐఓసీ, హెచ్‌డీఎఫ్‌సీలు ప్రారంభంలో లాభపడ్డాయి. అమెరికా డాలర్‌తో పాటు పోలిస్తే రూపాయి విలువ స్వల్ప లాభంలో 64.83 వద్ద ప్రారంభమైంది. 

Advertisement
 
Advertisement
Advertisement