11 నుంచీ తిరుపతిలో సీఐఐ ఇన్‌ఫ్రా సదస్సు | CII Infrastructure Conference on 11th in tirupathi | Sakshi
Sakshi News home page

11 నుంచీ తిరుపతిలో సీఐఐ ఇన్‌ఫ్రా సదస్సు

Dec 9 2014 12:16 AM | Updated on Jul 28 2018 6:48 PM

11 నుంచీ తిరుపతిలో సీఐఐ ఇన్‌ఫ్రా సదస్సు - Sakshi

11 నుంచీ తిరుపతిలో సీఐఐ ఇన్‌ఫ్రా సదస్సు

దక్షిణ భారత సీఐఐ సదస్సుకు తొలిసారిగా ద్వితీయ శ్రేణి నగరం వేదిక కానుంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణ భారత సీఐఐ సదస్సుకు తొలిసారిగా ద్వితీయ శ్రేణి నగరం వేదిక కానుంది. తిరుపతిలో డిసెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజులు పాటు సీఐఐ సమ్‌ఇన్‌ఫ్రా సదస్సు జరగనుంది. ‘సమ్‌ఇన్‌ఫ్రా-2014’ వివరాలను తెలియచేయడానికి సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐఐ ఏపీ చైర్మన్ సురేష్ రాయుడు చిట్టూరి మాట్లాడారు.

మొత్తం ఆరు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొనే ఈ సామవేశాలను డిసెంబర్ 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఇన్‌ఫ్రా రంగంలో ప్రభుత్వ ప్రైవేటు రంగ భాగస్వామ్య (పీపీపీ) పెట్టుబడుల అవకాశాలు, స్మార్ట్ సిటీ అంశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తుందని సీఐఐ వైస్ చైర్మన్ (ఏపీ) రామచంద్ర ఎన్ గల్లా తెలిపారు. ముగింపు కార్యక్రమంలో కేంద్ర మం త్రులు వెంకయ్యనాయుడు, పీయూష్ గోయల్ తదితరులు పాల్గొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement