జియోకి పోటీ : రూ.49కే 3జీబీ డేటా | Airtel Rs 49 Prepaid Pack Offers 3GB Data for 1 Day | Sakshi
Sakshi News home page

జియోకి పోటీ : రూ.49కే 3జీబీ డేటా

Apr 21 2018 7:42 PM | Updated on Apr 21 2018 7:42 PM

Airtel Rs 49 Prepaid Pack Offers 3GB Data for 1 Day - Sakshi

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌, మరోసారి రిలయన్స్‌ జియోకి కౌంటర్‌ ఇచ్చింది. ఒక్కరోజు వాలిడిటీతో 49 రూపాయలతో కొత్తగా ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. దీని కింద 3జీబీ 3జీ లేదా 4జీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. ఇది కేవలం ఎంపిక చేసిన సబ్‌స్క్రైబర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఎయిర్‌టెల్‌కు ఇప్పటికే రూ.49 ప్రీపెయిడ్‌ ప్యాక్‌ ఉంది. కానీ ఆ ప్యాక్‌లో కేవలం 1జీబీ 3జీ/4జీ డేటాను మాత్రమే ఆఫర్‌ చేస్తోంది. దీన్ని తన కస్టమర్లందరకూ అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ ప్యాక్‌, రిలయన్స్‌ జియో రూ.49 ప్యాక్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. జియో ప్యాక్‌ వాలిడిటీ 28 రోజులు.

కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్యాక్‌ను పొందడానికి ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ యూజర్లు మై ఎయిర్‌టెల్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది లేదా కంపెనీ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవ్వాలి. డేటా సెక్షన్‌ కింద ఈ ప్యాక్‌ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌కు యూజర్లు అర్హులో కాదో చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అర్హులు కాకపోతే, కేవలం 1జీబీ 4జీ డేటాను మాత్రమే పొందాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్‌ అందించే ఇతర ఆఫర్ల విషయానికొస్తే, ఇటీవలే కంపెనీ రూ.249 రీఛార్జ్‌ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. రూ.349 ప్యాక్‌ను అప్‌డేట్‌ చేసింది. రూ.249 ప్యాక్‌ కింద రోజుకు 2జీబీ డేటాను ఆఫర్‌చేస్తుండగా.. అప్‌డేట్‌ చేసిన ప్యాక్‌లో రోజుకు 3జీబీ డేటాను ఆఫర్‌ చేస్తోంది.    

Advertisement
 
Advertisement
Advertisement