రూ. 999కే విమానయానం | AirAsia offers flight tickets starting from Rs 999 under promotional sale | Sakshi
Sakshi News home page

రూ. 999కే విమానయానం

Aug 24 2017 12:57 AM | Updated on Oct 2 2018 7:37 PM

విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియా తాజాగా రూ. 999కే విమాన ప్రయాణ టికెట్ల ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 27 దాకా ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

ఎయిర్‌ఏషియా ఆఫర్‌
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియా తాజాగా రూ. 999కే విమాన ప్రయాణ టికెట్ల ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 27 దాకా ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈలోగా టికెట్లు బుక్‌ చేసుకున్న వారు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ఆగస్టు 28 మధ్య కాలంలో ప్రయాణించవచ్చు. వెబ్‌సైట్, ఎయిర్‌ఏషియా మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ కింద ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయన్నది ఎయిర్‌ఏషియా ఇండియా వెల్లడించలేదు. సీట్లు పరిమితంగానే ఉంటాయని, అన్ని ఫ్లయిట్స్‌లో అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది. కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం కోల్‌కతా, బాగ్‌డోగ్రా మధ్య విమాన ప్రయాణ చార్జీలు రూ. 999 నుంచి ఉన్నాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement