తిరుమలలో దళారీ వ్యవస్థకు చెల్లు

YV Subba Reddy Said Pagan Propaganda Would Be Controlled In Tirumala - Sakshi

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, నిజామాబాద్‌: తిరుమలలో దళారీ వ్యవస్థ రూపుమాపడమే లక్ష్యమని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని నర్సింగ్‌పల్లి గ్రామంలో గల ఇందూరు తిరుమల క్షేత్రంలో నిర్మించిన పద్మావతి కల్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలను రద్దు చేసామని తెలిపారు. తెలుగు రాష్ట్ర్రాల ప్రజలకు తిరుమల శ్రీవారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తిరుమలలో అన్యమత ప్రచారం పూర్తిగా రూపుమాపుతామన్నారు. రూ.10వేలు పైన విరాళాలు ఇచ్చేవారికి వీఐపీ దర్శనం ఎలా కల్పించాలనే దానిపై బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top