'జైట్లీ ఏమి హామీ ఇచ్చారో వెల్లడించాలి' | YSRCP Official Spokesperson vasireddy padma slams chandrababu naidu over special status | Sakshi
Sakshi News home page

'జైట్లీ ఏమి హామీ ఇచ్చారో వెల్లడించాలి'

Aug 3 2016 3:37 PM | Updated on Mar 23 2019 9:10 PM

'జైట్లీ ఏమి హామీ ఇచ్చారో వెల్లడించాలి' - Sakshi

'జైట్లీ ఏమి హామీ ఇచ్చారో వెల్లడించాలి'

సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై దేశంలోని 13 రాజకీయ పార్టీలో ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలంటుంటే... చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ మాత్రం కేంద్రాన్ని అడగలేకపోతున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. తన అవినీతికి భయపడే కేంద్రం వద్ద హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆమె బుధవారమిక్కడ ధ్వజమెత్తారు.

నిన్నటి వైఎస్ఆర్ సీపీ బంద్ విజయవంతం కావడం కేంద్రం దృష్టికి వెళుతున్న తరుణంలో టీడీపీ ఎంపీలు ధర్నా ఉపసంహరించుకోవడం సిగ్గుచేట్టు అన్నారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఫోన్లో మాట్లాడరని ధర్నా ఉపసంహరించుకోవడం...ప్రత్యేక హోదా టీడీపీ సొంత వ్యవహారం కాదన్నారు. ప్రత్యేక హోదాపై జైట్లీ ఏమి హామీ ఇచ్చారు? ఎప్పటిలోగా పరిష్కరిస్తామన్నారో బహిర్గతం చేయాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement