వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐల బస్సుయాత్ర ప్రారంభం | Ysrcp NRIs Bus Yatra started from Vizag | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐల బస్సుయాత్ర ప్రారంభం

Mar 25 2019 3:43 PM | Updated on Mar 25 2019 3:51 PM

Ysrcp NRIs Bus Yatra started from Vizag - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం బస్సు యాత్రను ప్రారంభించింది. ఈసారి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఎన్‌ఆర్‌ఐ విభాగం రంగం సిద్ధం చేసింది. రావాలి జగన్‌ కావాలి జగన్‌ అనే నినాదంతో ప్రజల్లోకి వెలుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. విశాఖపట్నం వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద బస్సుయాత్రను ప్రారంభించారు. ఈ బస్సును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్‌ ప్రారంభించారు.

యూఎస్‌, యూకే, సింగపూర్‌, మలేషియాలతో పాటూ వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు అందరూ కలిసి ఒక వింగ్‌గా ఏర్పడి వైఎస్‌ జగన్‌కు మద్దతుగా బస్సుయాత్ర ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో ప్రలోభాలకు గురవ్వకుండా వైఎస్సార్‌సీపీని గెలిపించాలని ఎన్‌ఆర్‌ఐలు కోరారు. ప్రత్యేక హోదా తీసుకు వచ్చే సత్తా కేవలం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఐ విభాగం నుంచి వెంకట్‌, వివిధ దేశాలనుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement