‘మూలన కూర్చోపెట్టినా ఆయనకు బుద్ధి రాలేదు’ | YSRCP MLA Koramutla Srinivasulu Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

బినామీలను కాపాడుకోవడానికే నీచ రాజకీయాలు

Apr 16 2020 8:02 PM | Updated on Apr 16 2020 8:19 PM

YSRCP MLA Koramutla Srinivasulu Comments On Chandrababu - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సాయం అందించాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన అనుచర గణం, బినామీలతో కోర్టులో పిటిషన్లు దాఖలు చేయించారని మండిపడ్డారు.

తమకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని.. కానీ ఈ తీర్పును ఛాలెంజ్‌ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని సంప్రదించి పేదల ఆకాంక్షను నెరవేరుస్తామని శ్రీనివాసులు తెలిపారు. కేవలం చంద్రబాబు బినామీదారులకు చెందిన నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలను కాపాడుకునేందుకే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు మూలన కూర్చోపెట్టినా ఆయనకు బుద్ధి రాలేదని శ్రీనివాసులు మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement