గ్రామాల్లో ఎవ్వరూ నిద్రపోవటం లేదు.. | ysrcp mangalagiri mla alla ramakrishna reddy takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో ఎవ్వరూ నిద్రపోవటం లేదు..

Dec 29 2014 10:51 AM | Updated on Oct 1 2018 2:00 PM

గ్రామాల్లో ఎవ్వరూ నిద్రపోవటం లేదు.. - Sakshi

గ్రామాల్లో ఎవ్వరూ నిద్రపోవటం లేదు..

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన చేసిన తర్వాత రైతులు ఎవ్వరూ గ్రామాల్లో నిద్రపోవడం లేదని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన చేసిన తర్వాత రైతులు ఎవ్వరూ గ్రామాల్లో నిద్రపోవడం లేదని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గ్రామాలు వదిలిపెట్టి...పొలాల్లో నిద్రపోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులను లక్ష్యంగా చేసుకుని బీభత్సం సృష్టించారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు.

సుమారు 8నుంచి 10మంది వరకూ ఈ దారుణానికి పాల్పడ్డారని రైతులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. దుండగులను గుర్తించి కేకలు వేసేలోపే వాళ్లు పారిపోయారని ఎమ్మెల్యే చెప్పారు. కాగా తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల్లోని దుండగులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వరిగడ్డి వాములు, అరటి తోటలు, కూరగాయల తోటల పందిళ్లు, గుడిసెలకు నిప్పు పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement