బాబు భూదాహం తీరడం లేదు | ysrcp leader partha saradhi takes on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

బాబు భూదాహం తీరడం లేదు

Jun 18 2017 2:10 AM | Updated on May 29 2018 4:37 PM

బాబు భూదాహం తీరడం లేదు - Sakshi

బాబు భూదాహం తీరడం లేదు

రాష్ట్రంలో అటవిక పరిపాలన నడుస్తోందని, రాక్షస రాజ్యం నడుస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పార్థసారథి ధ్వజమెత్తారు.

కొలుసు పార్థసారథి ధ్వజం
సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూ దాహం తీరడం లేదని ఆయన పేద రైతుల నోళ్లు కొట్టి లాక్కుంటున్న భూములను బడా బాబులకు పందేరం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికని చెప్పి రైతుల దగ్గరి నుంచి ఇప్పటికే తీసుకున్న 33 వేల ఎకరాలు చాలక మరో 14 వేల ఎకరాలను కొట్టేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, దీన్నిబట్టి ఆయన భూదాహం పరాకాష్టకు చేరుకుందని విమర్శించారు.మూడు గ్రామాల రైతులు తమ భూములు తీసుకోవాలని తన వెనుక బడి బతిమిలాడుతున్నట్లు చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఆ గ్రామాల్లో 14 వేల ఎకరాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పడంపై ఆయన మండిపడ్డారు. 
 
వెల్లంపల్లి ఇంటిపై దాడి గర్హనీయం 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేయడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని సారథి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement