ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్ సీపీ కైవసం | ysr congress party wins Yerraguntla municipal chairperson post | Sakshi
Sakshi News home page

ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్ సీపీ కైవసం

Jul 3 2014 11:34 AM | Updated on Oct 16 2018 6:15 PM

వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

కడప : వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ప్రజాతీర్పుకు భిన్నంగా అనైతిక పద్ధతుల్లో జెడ్పీపీఠాన్ని దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మొత్తం 20మంది కౌన్సిలర్లు ఉండగా, వైఎస్ఆర్ సీపీకి 10 ఓట్లు, టీడీపీకి 10 ఓట్లు వచ్చాయి. దాంతో ఓట్లు సమానంగా రావటంతో అధికారులు లాటరీ తీశారు. ఈ లాటరీలో వైఎస్ఆర్ సీపీ మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. ఆపార్టీ అభ్యర్థి ముసలయ్య మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement