వర్షాలపై 'వైఎస్‌ జగన్‌' సమీక్ష | AP Heavy Rains: YS Jagan Meeting With Officials - Sakshi Telugu
Sakshi News home page

వర్షాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

Oct 25 2019 12:06 PM | Updated on Oct 25 2019 12:24 PM

YS Jagan Holds Review On Heavy Rains - Sakshi

సాక్షి, అమరావతి/విజయవాడ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుసున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. వర్షాల కారణంగా పంట నష్టం, ఆస్తి నష్టంపై ఆయన అధికారులతో చర్చించారు. పంట నష్టం జరిగినా, ఆస్తి నష్టం జరిగినా వెంటనే అంచనాలను సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. అలాగే అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. 

అలాగే రాష్ట్రంలో వరదలపై నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ సమీక్ష చేపట్టారు. విజయవాడలోని ఇరిగేషన్‌ కార్యలయంలో ఆయన అన్ని జిల్లాల నీటిపారుదల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలోని జలాశయాల్లో ప్రస్తుత పరిస్థితి ఆరా తీశారు. అధికారులందరు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న చెరువుల వద్ద రింగ్‌బండ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.


కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల రహదారులు దెబ్బతినడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు పశ్చిమ కనుమల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం.. ప్రధాన ఉప నది తుంగభద్ర ఉరకలెత్తుతుండ టంతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. నది తీరంలోని చంచర్లపాడు, కంచికచెర్ల ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో పత్తి, మిర్చి పంటలు నీటమునిగాయి. దీంతో నది తీర ప్రాంతాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement