313వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | YS Jagan 313 Day PadaYatra Starts | Sakshi
Sakshi News home page

313వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Dec 5 2018 9:01 AM | Updated on Dec 5 2018 10:18 AM

YS Jagan 313 Day PadaYatra Starts - Sakshi

సాక్షి, ఎచ్చెర్ల (శ్రీకాకుళం): ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 313వ రోజు ప్రారంభమైంది. బుధవారం ఉదయం సంతవురిటి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి దవళ పేట, ఆనందపురం ఆగ్రహారం, వాండ్రంగి మీదుగా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరుకు చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 02:45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.

అక్కడి నుంచి రాపాక జంక్షన్‌, ఎరుకలపేట క్రాస్‌, కృష్ణాపురం మీదుగా రెడ్డి పేట వరకు నేడు పాదయాత్ర సాగనుంది. తమ సమస్యలను పరిష్కారించడానికి వస్తున్న జగనన్నను చూడడానికి ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జగన్‌ పాదయాత్ర అశేష ప్రజానీకం అపూర్వ  ఆదరాభిమానాల నడుమ అప్రతిహతంగా కొనసాగుతోంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement