భార్య శవంతో పోలీసుల ఎదుట లొంగిపోయిన భర్త | woman killed by husband | Sakshi
Sakshi News home page

భార్య శవంతో పోలీసుల ఎదుట లొంగిపోయిన భర్త

Aug 30 2014 8:16 AM | Updated on Aug 11 2018 9:10 PM

భార్య శవంతో పోలీసుల ఎదుట లొంగిపోయిన భర్త - Sakshi

భార్య శవంతో పోలీసుల ఎదుట లొంగిపోయిన భర్త

చిత్తూరు జిల్లా సంగరాయకుంటలో దారుణం చోటు చేసుకుంది. సలీం అనే వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు.

చిత్తూరు: చిత్తూరు జిల్లా సంగరాయకుంటలో దారుణం చోటు చేసుకుంది. సలీం అనే వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దాంతో ఆమెను గత అర్థరాత్రి కత్తితో పొడిచి పాశవికంగా హత్య చేశాడు. అనంతరం అతడు భార్య శవంతో పోలీసు స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడ్ని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement