భోజనం చేస్తుండగా పిడుగుపాటు | Woman dies due to thunderbolt | Sakshi
Sakshi News home page

భోజనం చేస్తుండగా పిడుగుపాటు

Sep 14 2015 3:57 PM | Updated on Aug 24 2018 2:36 PM

అప్పటి వరకు పొలంలో చెమటోడ్చి... ఆకలితో భోజనం చేస్తున్న ఓ మహిళను పిడుగు బలి తీసుకుంది.

దుర్గి (గుంటూరు) : అప్పటి వరకు పొలంలో చెమటోడ్చి... ఆకలితో భోజనం చేస్తున్న ఓ మహిళను పిడుగు బలి తీసుకుంది. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా దుర్గి మండలం నెహ్రూ నగర్ తాండాకు చెందిన రమావతు శాంతిబాయి(25) సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పొలంలో చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తోంది. అదే సమయంలో వర్షంతోపాటు సమీపంలోనే పిడుగు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శాంతిబాయికి భర్త బాల్‌సింగ్, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement