భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్టు | wife and her lover arrested in husband murder case | Sakshi
Sakshi News home page

భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్టు

Mar 18 2015 9:37 PM | Updated on Aug 20 2018 4:27 PM

భర్తను హత్య చేసిన కేసులో భార్యను, ఆమె ప్రియుడ్ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.

బ్రహ్మంగారిమఠం (కర్నూల్): భర్తను హత్య చేసిన కేసులో భార్యను, ఆమె ప్రియుడ్ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. మండల కేంద్రమైన బ్రహ్మంగారిమఠంలోని బ్రహ్మంసాగర్ సమీపంలో ఉన్న కొత్తబసవాపురం గ్రామంలో ఈ నెల 8న వంగ జయరామానాయుడిని ఆయన భార్య, ఆమె ప్రియుడు హత్య చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ నెల 7వతేదీన జయ రామానాయుడు లారీకి వెళ్లి తిరిగి వచ్చాడు. ఇంట్లో భార్య వెంకటలక్ష్మీ, ఆమె ప్రియుడు సోమయ్యలు ఉండటం గమనించాడు.

ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో భర్తను వెంకటలక్ష్మీ గొడ్డలితో కొట్టింది. జయరాముడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రియుడు సోమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చికిత్స కోసం భర్తను తీసుకెళుతుండగా రాజంపేట వద్ద మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి మైదుకూరు రూరల్ సి.ఐ నాగభూషణం చొరవతో హత్యకు సంబంధించిన వివరాలను పూర్తిగా సేకరించి వెంటలక్ష్మి, ఆమె ప్రియుడు సోమయ్యలను 302, 201 సెక్షన్‌ల కింద అరెస్టు చేశామని ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement