ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి | Two killed in road accident at Kadapa District | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి

Jul 27 2017 8:50 AM | Updated on Aug 30 2018 4:10 PM

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

గోపవరం:  వైఎస్సార్‌ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని గోపవరం మండల కాంప్లెక్స్‌ సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. లక్కిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మస్తాన్‌(27) మరో ఇద్దరి మహిళలతో కలిసి ద్విచక్రవాహనంపై నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట దర్గాకు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు రోడ్డుపై పడిపోయారు.

అదే సమయంలో అటు నుంచి వస్తున్న ట్రాక్టర్‌ వారి పై నుంచి వెళ్లడంతో.. మస్తాన్‌తో పాటు ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్ర గాయాలపాలైన మరో మహిళను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement