రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి | two killed in a Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి

Dec 31 2015 11:46 AM | Updated on Aug 30 2018 3:56 PM

అనంతపురం జిల్లా డి.హీరేహళ్‌లోని పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

అనంతపురం జిల్లా డి.హీరేహళ్‌లోని పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా జైలు సూపరింటెండెంట్ భీం శేఖర్, ఆయన భార్య రేఖ(35) ఇద్దరు పిల్లలతోపాటు కానిస్టేబుల్ పురుషోత్తం బళ్లారి వైపు కారులో వెళ్తున్నారు. వారి వాహనాన్ని డి.హీరేహళ్ వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో రేఖ, పురుషోత్తం అక్కడికక్కడే చనిపోగా, భీంశేఖర్ ఆయన ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బళ్లారిలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.



 

Advertisement
 
Advertisement
Advertisement