కారు-బైక్ ఢీ.. యువకుడి మృతి | The young man killed in car - bike collided .. | Sakshi
Sakshi News home page

కారు-బైక్ ఢీ.. యువకుడి మృతి

Oct 31 2015 4:36 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారా కోడూరు గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్(25) ట్రావెల్స్ డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో శనివారం బైక్‌పై చేబ్రోలు నుంచి గుంటూరు వెళ్తున్న సమయంలో గుంటూరు నుంచి తెనాలి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో హుస్సేన్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement