యువకుని అనుమానాస్పద మృతి | The mysterious death of a young man | Sakshi
Sakshi News home page

యువకుని అనుమానాస్పద మృతి

Dec 28 2015 2:03 PM | Updated on Sep 3 2017 2:42 PM

వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామ శివారులోని వరి పొలాల్లో సోమవారం ఉదయం యువకుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామ శివారులోని వరి పొలాల్లో సోమవారం ఉదయం యువకుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామానికి చెందిన కిష్టయ్య, చెన్నమ్మ దంపతుల ఏకైక కుమారుడు శివ(22) ఆర్‌టీపీపీలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని పొలాల్లో విగతజీవి అయి కనిపించాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డీఎస్పీ అశోక్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement