Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YS Jagan Ask Ballot Papers System Instead Of EVMs
EVMలపై వైఎస్‌ జగన్‌ కీలక ట్వీట్‌, ఏమన్నారంటే..

గుంటూరు, సాక్షి: ఏపీ ఎన్నికల ఆశ్చర్యకరమైన ఫలితాలపైనా ఒకవైపు.. ఈవీఎంల ట్యాంపరింగ్‌, హ్యాకింగ్‌, అన్‌లాకింగ్‌ తదితర అంశాలపై చర్చ మరోవైపు తీవ్ర చర్చ నడుస్తోంది. ఫలితాలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మాత్రమే కాదు.. ఏపీ ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎక్స్‌ ఖాతాలో ఓ కీలక సందేశం ఉంచారు.‘‘న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తమ్మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్‌ బ్యాలెట్లు వాడుతున్నారు. ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి’’ అని అన్నారాయన.Just as justice should not only be served, but should also appear to have been served, so should democracy not only prevail but must appear to be prevalent undoubtedly. In electoral practices across the world in almost every advanced democracy, paper ballots are used, not EVMs.…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 18, 20242024 సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌, హ్యాకింగ్‌లపై మరోమారు చర్చ మొదలైన సంగతి తెలిసిందే. టెస్లా యజమాని, టెక్నాలజీ మేధావి ఎలాన్‌ మస్క్‌ స్వయంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని విస్పష్టంగా పేర్కొనగా... కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ మస్క్‌ వ్యాఖ్యలను ఖండించారు. అయితే రాజీవ్‌ మాటలకు ప్రత్యుత్తరంగా మస్క్‌ ఇంకో ట్వీట్‌ చేస్తూ... ఏనీథింగ్‌ క్యాన్‌ బీ హ్యాక్డ్‌ అని స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు... దేశంలో టెలికాం విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, సీ-డాక్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ పిట్రోడా సైతం ఈ చర్చలో పాల్గొంటూ ఈవీఎంల హ్యాకింగ్‌ సాధ్యమేనని వ్యాఖ్యానించడం ఇటీవలి పరిణామమే.ఈవీఎం 'అన్‌లాకింగ్'పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతున్నా.. తాజా ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రెకెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్‌ బ్యాలెట్‌ను ఉపయోగించాలనే అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు వైఎస్‌ జగన్‌.

Ex Minister Ambati Rambabu Fires On Chandrababu
చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యం: అంబటి

సాక్షి, గుంటూరు: గతంలో చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయ్యిందని ఏపీ మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం చంద్రబాబు తాజాగా పొలవరంలో పర్యటించడం.. ప్రెస్‌మీట్‌ నిర్వహించి గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో అంబటి స్పందించారు. తాడేపల్లిలో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరానికి జగన్‌ ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. వైఎస్‌ జగన్‌పై బురద చల్లాలని ప్రభుత్వం ప్రయతిస్తోంది. కానీ, చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి. వైఎస్‌ జగన్‌ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి. మా పాలనలో పోలవరం పనుల్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదు. చంద్రబాబు ఇప్పటికైనా తాను చేసిన తప్పుల్ని గుర్తించాలి అని అంబటి హితవు పలికారు.‘‘చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. పోలవరాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు డబ్బులు సంపాదించాలని చూశారు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పిదాలను గుర్తించాలి’’ అని అంబటి రాంబాబు అన్నారు.

NEET Row: Supreme Court Blast On NTA June 18 Hearing Updates
NEET NTA: తప్పు జరిగితే ఒప్పుకోండి

న్యూఢిల్లీ, సాక్షి: NEET- 2024 పరీక్ష అవకతవకలపై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బాధ్యత గల సంస్థగా NTA పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, తప్పు జరిగితే ఒప్పుకుని వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.నీట్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా.. ‘‘నీట్‌పరీక్షలో ఏమాత్రం నిర్లక్ష్యం జరగదు. పిల్లలు పరీక్షలకు సిద్ధం అయ్యారు. వాళ్ల కఠోర శ్రమను మనం వృథా చేయొద్దు. పరీక్షను నిర్వహించే సంస్థగా.. మీరు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తప్పు జరిగితే.. ‘అవును తప్పు జరిగింది’ అని చెప్పండి. అప్పుడు మేం చర్యలు తీసుకుంటాం. కనీసం ఇలాగైనా పని తీరు మెరుగుపడేందుకు కావాల్సిన ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుందేమో’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. .. అలాగే విద్యార్థుల ఫిర్యాదుల్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఏదైనా తప్పిదం ఉంటే వెంటనే సరిచేయాలి. నీట్ పరీక్ష వ్యవహారంలో 0.001 శాతం నిర్లక్ష్యం వహించినా దాన్ని పూర్తిగా పరిష్కరించాలి’’ అని ఎన్టీయేకు సుప్రీం బెంచ్‌ సూచించింది. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తో పాటు కేంద్రానికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ.. విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు నీట్‌ వ్యవహారంలో ‘ఫిజిక్స్‌ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండే వేసిన పిటిషన్‌పైనా జూన్‌ 13వ తేదీన విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కౌన్సెలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ.. కేంద్రం, ఎన్టీయేలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ తదుపరి విచారణను జులై 8వ తేదీకే వాయిదా వేసింది.

ap inter second year supplementary results release
AP: ఒక్క క్లిక్‌తో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ ఫలితాలు

ఒక్క క్లిక్‌తో జనరల్‌ ఫలితాలుఒక్క క్లిక్‌తో ఒకేషనల్‌ ఫలితాలు ఏపీ ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏపీ ఇంటర్‌ బోర్టు ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా మే 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితియ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలునిర్వహించారు. ఈ పరీక్షలకు రెండో సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.

Prabhas Kalki 2898 AD Pre Sales Bussiness North America
రిలీజ్‌కి ముందే ప్రభాస్ 'కల్కి' మరో రికార్డ్.. ఈసారి ఏకంగా!

డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' సినిమా మరో 9 రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. సినిమాపై హైప్ ఎక్కువగానే ఉంది. కానీ ప్రమోషన్సే సరిగా చేయట్లేదని ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. తాజాగా 'భైరవ ఏంథమ్' పేరుతో ఓ పాట రిలీజ్ చేశారు. కానీ ఇందులో పంజాబీ ఫ్లేవర్ ఎక్కువగా ఉండేసరికి తెలుగు ఆడియెన్స్‪‌కి సరిగా ఎక్కలేదు. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి టాక్ నడుస్తూనే ఉంది. ఇదంతా ఓవైపు నడుస్తుండగానే 'కల్కి' ఖాతాలో సరికొత్త రికార్డ్ చేరింది.(ఇదీ చదవండి: ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?)'బాహుబలి' తర్వాత ప్రభాస్ రేంజు, మార్కెట్ పెరిగిపోయింది. సినిమాల విడుదలకు ముందే ప్రీ సేల్స్ విషయంలో మంచి బిజినెస్ జరుగుతోంది. తాజాగా అలా కేవలం ఉత్తర అమెరికాలోనే 2 మిలియన్ డాలర్ల బిజినెస్ జరిగిపోయింది. రిలీజ్‌కి ముందు ఓ సినిమా ఇంతలా బిజినెస్ చేయడం ఇదే తొలిసారి అని మూవీ టీమ్ చెబుతోంది. ఒకవేళ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే గనక రూ.1000 కోట్ల వసూళ్లు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.'కల్కి' ట్రైలర్ బాగుంది. కానీ ఎందుకో కావాల్సినంత హైప్ మాత్రం ఇంకా రావట్లేదు అనిపిస్తోంది. రిలీజ్ ట్రైలర్ మరేదైనా తీసుకొస్తే అప్పుడు అంచనాలు ఏర్పడొచ్చు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ దర్శకుడు, సంతోష్ నారాయణన్ సంగీతమందిచాడు.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?)

Chair Tea For TDP Workers Must Minister Atchannaidu Warn Officials
పచ్చ బిళ్ల వేసుకుని వెళ్లండి: అచ్చెన్నాయుడు

గంగ చంద్రముఖిగా మారేందుకు ఎక్కువ సమయమేమీ పట్టలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రెండు వారాల్లోపే టీడీపీ నేతలు తమ అసలు రంగును బయటపెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పశు సంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి నిదర్శనంశ్రీకాకుళం, సాక్షి: ‘‘టీడీపీ కార్యకర్తల్లారా.. పసుపు బిళ్ల పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లండి. మీకు అక్కడి అధికార యంత్రాంగం సకల రాచమర్యాదలు చేస్తుంది. అలా చేయకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు..’’ అంటూ ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.‘‘.. ఏ ఆఫీస్ అయినా సరే. పసుపు బిళ్ళతో వచ్చే టీడీపీ కార్యకర్తలకు పనులు చేయాల్సిందే. తమ కార్యాలయంలో అడుగు పెట్టిన టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మర్యాదగా చూసుకోవాలి. మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పనిచేస్తారు. అలా వారికి నేను ఆదేశాలను జారీ చేస్తా. మాట వినని ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారిని నేను దారిలోకి తెస్తా. ఒకరో ఇద్దరో ఆ మాట జవ దాటితే ఏమవుతుందో ప్రత్యేకంగా నేను ఆ అధికారులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా టీడీపీ కార్యకర్తల పనులు వేగంగా జరిగేలా నేనే సమావేశం పెట్టి ఆ అధికారుల్ని ఆదేశిస్తా’’ అని టీడీపీ కార్యకర్తలకు అచ్చెన్న భరోసా ఇచ్చారు. అంతేకాదు.. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టవద్దు అంటూ కార్యకర్తలను ఉద్దేశించి రెచ్చగొట్టేలా అచ్చెన్నాయుడు మాట్లాడారు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించగా.. ఆ భేటీలోనే అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. AP Animal Husbandry and Fisheries Minister Atchannaidu’s open warning to officials and brazen abuse of power. Honorary Minister tells govt officials to salute TDP workers and give them royal treatment in govt offices. #Atchannaidu #TDP #AP #AndhraPradesh pic.twitter.com/NSPY9FGFfQ— Sakshi Post (@SakshiPost) June 18, 2024 VIDEO CREDITS: Sakshi Post

Ksr Comments On Hoardings And Lokesh Red Book Warnings Under AP TDP Rule
ఏపీలో చంద్రన్న రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్లేనా?

నేను ఫలానా వాళ్లను కొట్టబోతున్నాను.. లేదా చంపబోతున్నాను అని ఎవరైనా పెద్ద హోర్డింగ్ పెడితే ఏమవుతుంది. వెంటనే పోలీసులు చర్య తీసుకుని అలాంటి హోర్డింగ్ ను తొలగించడమే కాకుండా, అలా చేసినవారిని అదుపులోకి తీసుకుంటారు. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో అయినా జరిగే ప్రక్రియ. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. బహిరంగంగా హోర్డింగ్ లు పెట్టి రెడ్ బుక్ సిద్ధం అంటూ తమ నేత బొమ్మ వేసుకుని మరీ ప్రచారం చేసుకోవచ్చు. అయినా పోలీసులు స్పందించరు. రాష్ట్ర ప్రభుత్వం ఆనందంగా చూస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం పట్టి, పట్టనట్లు వ్యవహరిస్తుంది. వారికి ఇష్టమైన మీడియా ఆహో, ఓహో అని భజన చేస్తాయి. ఇదో చిత్రమైన పరిస్థితి అని చెప్పాలి.⇒ ఏపీలో తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతోనే ఇలాంటి దారుణమైన పోకడలు సాగుతున్నాయి. దీనిని అదుపు చేసే పరిస్థితి ఇప్పట్లో ఉండదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయాలలో వైరుధ్యాలు, వైషమ్యాలు ఉండవచ్చు. కోప, తాపాలు ఉండవచ్చు. లేదా ఎదుటివారు ఎదైనా తప్పు చేశారనుకుంటే చట్టపరంగా కేసులు పెట్టవచ్చు. ఇవేవి కాకుండా మీ అంతు చూస్తామంటూ బహిరంగంగా బోర్డులు పెడుతున్నారు. అదేదో గొప్ప పనిగా వారు చెప్పుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైన చర్యేనా అనే ప్రశ్న వస్తే, మైట్ ఈజ్ రైట్ అన్నట్లుగా, రౌడీలు, గూండాలు చెలరేగిపోయినా పట్టని కాలంలో మాత్రమే ఇలాంటివాటిని సమర్థించగలం.⇒ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటివి జరగకూడదు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నలభైఆరేళ్లుగా రాజకీయాలలో అత్యంత క్రియాశీలకంగా ఉన్నారు. దేశంలోనే ఆయన అంత అదృష్టవంతుడైన నేత లేరంటే అతిశయోక్తి కాదు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగాను, అంతకన్నా ఎక్కువకాలం ప్రతిపక్ష నేతగాను వ్యవహరించారు. ఆయనకు నిబంధనలు, చట్టం, రాజ్యాంగం గురించి తెలియవని అనుకుంటే పొరపాటు. అయినా ఆయన ఏలుబడిలో ఇలాంటి దుశ్చర్యలు ఎలా కొనసాగుతున్నాయంటే ఏమి చెబుదాం. ఆయనలో ఇంకా కక్షపూరిత రాజకీయాలు పోలేదన్న అభిప్రాయానికి తావిస్తున్నారు.⇒ గత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రభుత్వంలో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే తీవ్రంగా స్పందించి, రాజారెడ్డి రాజ్యాంగం అని, ఇంకొకటని అరిచి ఘీ పెట్టిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు తాము అధికారంలోకి రాగానే కొత్త రాజ్యాంగం సృష్టించుకున్నారని అనుకోవాలా? చంద్రన్న రాజ్యాంగం అమలులోకి వచ్చినట్లా? దీని ప్రకారం ఎవరినైనా తాము కొట్టవచ్చని, తిట్టవచ్చని, చంపవచ్చని, ఎవరూ మాట్లాడడానికి వీలు లేదని కొత్త నిబంధనలు తయారు చేశారా! పైగా వాటిని బహిరంగంగా హోర్డింగ్ ల ద్వారా ప్రజలందరికి తెలియచేసే కొత్త సంస్కృతికి తెరదీశారా? ఇదేనా చట్టబద్దమైన, రాజ్యాంగ పాలన అంటే!⇒ ప్రతిపక్షంలో ఉండగా, ఎవరు సలహా ఇచ్చారో కానీ లోకేష్ తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ అంటూ పట్టుకు తిరిగారు. తమ పట్ల అనుచితంగా వ్యవహరించారన్న భావన కలిగితేనో, అధికారుల శైలి తమకు నచ్చకపోతేనో, లేక తాము చేసే అల్లర్లకు అడ్డుపడితేనో, కేసులు పెడితేనో, వారి పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నామని, అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామని బెదిరిస్తుండేవారు. తొలుత ఎవరూ దీనిని సీరియస్ గా తీసుకోలేదు.⇒ కొందరు సరదాగా తీసుకుంటే, పోలీసు అధికారులు సైతం పెద్దగా స్పందించలేదు. అయితే చంద్రబాబు, లోకేష్ లపై ఆయా స్కాములకు సంబంధించి కేసులు పెట్టిన సందర్భంలో అప్పటి సీఐడీ అధికారులు ఈ రెడ్ బుక్ వ్యవహారంపై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని కోర్టు ఇంకా తేల్చలేదు. ఈలోగానే వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోయి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో రెడ్ బుక్ కేసు ఏమవుతుందో కానీ, అధికారులు ఎవరూ దానిని పర్స్యూ చేసేపరిస్థితి ఉండదు. రెడ్ బుక్ అంటూ తిరిగిన వ్యక్తి లోకేష్ మంత్రి అయ్యారు. ఆ రెడ్ బుక్ ను విశాఖ సభలో ఆయన తన తండ్రి చంద్రబాబుకు అందచేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.⇒ ఆ రెడ్ బుక్ లో పలువురు అధికారుల పేర్లు, వైఎస్సార్‌సీపీ నేతల పేర్లు.. లేదా ఇంకొందరు తమను వ్యతిరేకించేవారి పేర్లు రాసుకుని ఉండవచ్చు. ఆయా సభలలో కొందరి పేర్లను లోకేష్ ప్రకటిస్తూ వచ్చారు కూడా. చిత్తూరులో ఒక ఎస్పీ పేరును ఇలానే అప్పట్లో ప్రకటించారు. అలా అధికారులను బెదిరించవచ్చా! నిజంగానే అధికారంలోకి వచ్చారు కనుక వారిపై చర్య తీసుకుంటామని బహిరంగంగా బోర్డులు పెట్టవచ్చా! గతంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి ఘట్టాలు చోటు చేసుకున్నాయా! అసలే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హింసాకాండతో రాష్ట్రం అట్టుడుకుతుంటే, అది చాలదన్నట్లు రెడ్ బుక్ సిద్దం అంటూ ప్రజలను భయభ్రాంతులను చేసే ప్రకటనలు ఏమిటో తెలియదు.⇒ టీడీపీ నేత బుద్దా వెంకన్న వంటివారు వారిని అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని రాజకీయ ప్రకటనలు చేస్తుంటే అదేదో మామూలేనని అనుకుంటాం. నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, మరొక టీడీపీ నేత కూర్చుని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఓడిపోయాడు కానీ, చావలేదు.. అని అంటుంటే వీరి మనసులో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయా? అన్న విషయం బహిర్గతం అయిపోతుంది. దానికి తగినట్లుగానే రెడ్ బుక్ హోర్డింగ్ లు పెడుతున్నారన్న అనుమానం ప్రజలలో ప్రబలుతుంది.⇒ పూర్వకాలంలో తమ అధికారానికి అడ్డు పడుతారనుకునే వారిని రాజులు, నియంతలు చంపించేసేవారట. ఉత్తర కొరియా వంటి దేశాలలో ఇప్పటికీ అలాంటి రాక్షస సంస్కృతి ఉంది. చైనాలో ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది కమ్యూనిజం ముసుగులో ఉన్న నియంత రాజ్యం కనుక. చైనాలో సాంస్కృతిక విప్లవం పేరుతో ఎన్ని ఘోరాలు జరిగాయో చరిత్ర చెబుతుంది. రష్యాలో పుతిన్ కు ఎదురుతిరిగినవారిని బతకనివ్వడం లేదని వార్తలు వచ్చాయి. కానీ ప్రజాస్వామ్యదేశంగా ఉన్న భారత్ లో అలాంటివి సాధ్యమేనా? అందులోను ఒక రాష్ట్రంలో ఇలా జరుగుతుందా? అది ఎల్లకాలం అయ్యే పనేనా? అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఉండేది ఐదేళ్ల కాలపరిమితే అన్న సంగతి మర్చిపోయి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతే తర్వాత ప్రజలు వాటిని గుర్తుంచుకోరా?⇒ గొప్ప నేతగా పేరుపొందిన ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి పెట్టి ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలను జైళ్లపాలు చేసిన తర్వాత కొంతకాలం అధికారంలో ఉండగలిగారు కానీ, ఆ తర్వాత ఎన్నికలలో ఘోర పరాజయం చెందారు. కొన్ని రాష్ట్రాలలో ఇలాంటి అనుభవాలు ఎదురుకాకపోలేదు. అయినా రాజకీయ నేతలు గుణపాఠాలు నేర్చుకోరు. పోలీసులు తమ చేతిలో ఉంటారు కనుక ఏమైనా చేయవచ్చని, ఇతర వ్యవస్థలను ప్రభావితం చేయవచ్చన్న విశ్వాసంతో అరాచకాలకు పాల్పడుంటారు. కానీ ఆ తర్వాత వారు కూడా ఏదో నాడు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవలసి వస్తుందని మర్చిపోతారు.⇒ ఎంత పిల్లి అయినా గదిలో పెట్టి కొడితే తిరగబడుతుందని సామెత. ఒకపక్క రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తున్న సమయంలోనే ఈ రెడ్ బుక్ ప్రకటనలు ఇంత బహిరంగంగా హోర్డింగ్ ల రూపంలో జనంలోకి వస్తే, గూండాలను, మాఫియాలను ఎంకరేజ్ చేసినట్లా? కాదా? అన్నది వారే ఆలోచించుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

June 18 International Picnic Day history and significance
International Picnic Day : ఛలో పిక్నిక్‌...అటు విందు, ఇటు దిల్‌ పసందు

నేడు (జూన్ 18) అంతర్జాతీయ పిక్నిక్‌ డే నిర్వహించుకుంటారు. కచ్చితమైన కారణం, మూలంపై పూర్తి స్పష్టతలేనప్పటికీ పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఫ్రెంచ్ విప్లవం తరువాత ఇది ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ప్రజలకు అనుమతి ఉండేది కాదు. దీంతో విప్లవం తరువాత ప్రజలు అంతా తమ స్నేహితులు, సన్నిహితులతో గడిపేందుకు, కలిసి భోజనం చేసేందుకు పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లేవారట. పిక్నిల ద్వారా ప్రజలుకొత్త ఉత్సాహాన్ని పొందేవారట. కాలక్రమంలో ఇందులోని అసలు ఆనందం తెలిసి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులారిటీ పెరిగింది. 2009లో, పోర్చుగల్‌లోని లిస్బన్‌లో 20 వేల మందితో జరిగిన పిక్నిక్‌ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అతిపెద్ద పిక్నిక్‌గా రికార్డుల కెక్కింది. రొటీన్‌ దినచర్య నుండి కొంత విరామం తీసుకుని, మన ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడమే పిక్నిక్‌. పిక్నిక్ అనే పదం ఫ్రెంచ్ పదం పిక్-నిక్ నుండి ఉద్భవించిందని చెబుతారు. కుటుంబ సభ్యులతోపాటు హితులు, సన్నిహితులతో కలిసి ఉత్సాహంగా కాలం గడపడం, తద్వారా రోజువారీ జీవితాల్లోని ఆందోళన, ఒత్తిడి నుంచి దూరంగా గడిపి, కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకోవాలనేదే ఈ అంతర్జాతీయ పిక్నిక్‌ డే ఉద్దేశం. పిక్నిక్‌లు పలు రకాలుచిన్నప్పుడు స్కూలు పిల్లలతో కలిసి సరదాగా జూకు, పార్క్‌లకు, జాతీయనేతల సినిమాలను చూడటానికి థియేటర్లకు, ఇతర ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లకు వెళ్లిన సందర్భాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.ఆ తరువాత కాలేజీ రోజుల్లో విహారయాత్రలు, పిక్నిక్‌ల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. కొత్త కొత్త స్నేహాలతో కొత్త ఉత్సాహం ఉరకలేస్తూ, నవయవ్వనంలో చేసే చిలిపి చేష్టలు, సరదా సరదా పనులు అద్బుతమైన అనుభవాలుగా మిగిలి పోతాయి. ఇంకా కిట్టీ పార్టీలు, ఆఫీసుపార్టీలు, అసోసియేషన్ల సెలబ్రేషన్లు, కార్తీక వనభోజనాలు ఇలాంటివన్నీ బోలెడన్నీ కొత్త పరిచయాలను, సరికొత్త ఆనందాలను పంచుతాయి. అంతేనా..అటు విందు భోజనం, ఇటు ఆహ్లాదకరమైన వాతావరణంలో దిల్లంతా పసందు.పచ్చని ప్రకృతి, అద్హుతమైన సూర్యరశ్మి, చక్కటి సంగీతం, ఆటా, పాటా, వీటన్నింటికి మించి మనకు నచ్చిన దోస్తులు..ఈ కాంబినేషన్‌ సూపర్‌ హిట్టే కదా. అందుకే అప్పుడపుడూ నవ్వులు, కేరింతలతో గడిపేలా పిక్నిక్‌కి చెక్కేద్దాం. హ్యాపీ పిక్నిక్‌..

EVM Row: List Of Countries Banned EVMs Elections Through Paper Ballot
మీకు తెలుసా? ఈ దేశాల్లో ఈవీఎంలు వద్దు.. పేపర్‌ బ్యాలెటే ముద్దు

అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఎన్నికల కోసం ఈవీఎంలను కాదు.. ఇంకా పేపర్‌ బ్యాలెట్‌నే వాడుతున్నాయి. ఆశ్చర్యకరంగా అనిపించినా ఇదే నిజం కూడా. సాధారణంగా ఎన్నికల నిర్వహణకు కొన్ని పద్ధతులంటూ ఉన్నాయి. పేపర్‌ బ్యాలెట్‌, ఈవీఎం వాడకం.. లేదంటే రకరకాల కాంబినేషన్‌లలో నిర్వహించడమూ జరుగుతోంది. మరి టెక్నాలజీ మీద తప్పనిసరిగా ఆధారపడుతున్న ఈరోజుల్లో.. ఆ దేశాలు ఈవీఎంలను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో చూద్దాం. 👉ప్రపంచంలో నిర్దిష్ట కాలపరిమితితో ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలు నిర్వహించుకుంటున్నాయి. అందులో 100 దాకా దేశాలు ఇప్పటికీ పేపర్‌ బ్యాలెట్‌ పద్దతినే అవలంభిస్తున్నాయి. 👉పిలిఫ్పైన్స్‌, ఆస్ట్రేలియా, కోస్టారికా, గువాటెమాలా, ఐర్లాండ్‌, ఇటలీ, కజకస్థాన్‌, నార్వే, యూకే.. ఈవీఎంలను ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. వాటి ఫలితాల ఆధారంగా చివరకు పోస్టల్‌ బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు కొనసాగిస్తున్నాయి.👉భద్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయత, ఎన్నికల ధృవీకరణ.. ఇవన్నీ ఈవీఎంల వాడకంపై అనుమానాలకు కారణం అవుతున్నాయి. అందుకే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని ఇప్పటికీ ఈవీఎంలను వాడడం లేదు.👉జర్మనీ, నెదర్లాండ్స్‌, పరాగ్వే దేశాలు ఈవీఎంల వాడాకాన్ని పూర్తిగా ఆపేశాయి. అక్కడ పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.👉2006లో నెదర్లాండ్స్‌ ఈవీఎంలను నిషేధించింది. 2009లో ఐర్లాండ్‌, అదే ఏడాది ఇటలీ సైతం ఈవీఎంలను బ్యాన్‌ చేశాయి. బ్యాలెట్‌ పేపర్‌తో పాటు రకరకాల కాంబోలో ఎన్నికలు జరుగుతున్నాయి. 👉సాంకేతికలో ఓ అడుగు ఎప్పుడూ ముందుండే జపాన్‌లో.. ఒకప్పుడు ఈవీఎంల వాడకం ఉండేది. కానీ, 2018 నుంచి అక్కడా ఈవీఎంల వాడకం నిలిపివేశారు.👉అగ్రరాజ్యం అమెరికా సహా చాలా దేశాల్లో ఈవీఎంల వాడకం పూర్తిస్థాయిలో జరగడం లేదు. విశేషం ఏంటంటే.. అక్కడ ఇప్పటికీ ఈ-ఓటింగ్‌ను ఈమెయిల్‌ లేదంటే ఫ్యాక్స్‌ ద్వారా పంపిస్తారు. అలాగే.. బెల్జియం, ఫ్రాన్స్‌, కెనడా, మెక్సికో, పెరూ, అర్జెంటీనాలో కొన్ని ప్రాంతాల్లో.. కొన్ని ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలను వినియోగిస్తున్నారు.👉2009 మార్చిలో జర్మనీ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంల వాడకం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఈవీఎం పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎన్నికలలో పారదర్శకత అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని జర్మనీ కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.👉ప్రపంచవ్యాప్తంగా భారత్, బ్రెజిల్‌‌, వెనిజులా సహా పాతిక దేశాలు మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయి. అందులో పూర్తి స్థాయి ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతోంది సింగిల్‌ డిజిట్‌లోపు‌ మాత్రమే. మిగతా దేశాలు స్థానిక ఎన్నికల్లో, కిందిస్థాయి ఎన్నికల్లో మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నాయి. 👉భూటాన్‌, నమీబియా, నేపాల్‌లో భారత్‌లో తయారయ్యే ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాయి. 👉ఈవీఎంల విశ్వసనీయతపై చర్చ జరగడం ఇప్పుడు తొలిసారి కాదు. 2009లో సుబ్రమణియన్‌ స్వామి(అప్పటికీ ఆయన ఇంకా బీజేపీలో చేరలేదు) ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని అభిప్రాయపడ్డ ఆయన.. న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు. అయితే ఇప్పుడు ఈవీఎంల వద్దని, పోస్టల్‌ బ్యాలెట్‌ ముద్దు అని పోరాటాలు ఉధృతం అవుతున్న వేళ.. ఆయన మౌనంగా ఉండిపోయారు.

Gambhir Only Applicant For India Head Coach BCCI to name new selector too: Report
BCCI: ద్రవిడ్‌తో పాటు వాళ్లందరూ అవుట్‌! గంభీర్‌ కొత్త టీమ్‌?

టీమిండియా హెడ్‌కోచ్‌గా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ నియామకం ఖరారు కానుంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఇందుకు సంబంధించిన ప్రక్రియను మంగళవారం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.రవిశాస్త్రి తర్వాత భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం వన్డే వరల్డ్‌కప్‌-2023 నాటికే ముగిసిపోయింది. అయితే, టీ20 ప్రపంచకప్‌-2024 పూర్తయ్యే వరకు కొనసాగమని బీసీసీఐ కోరగా.. ద్రవిడ్‌ అందుకు అంగీకరించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.గంభీర్‌ వైపే మొగ్గుఈ క్రమంలో బీసీసీఐ ద్రవిడ్‌ వారసుడి ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్‌ వైపు మొగ్గుచూపిన బోర్డు పెద్దలు.. అతడితో సంప్రదింపులు జరిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.అందుకు అనుగుణంగానే గంభీర్‌ సైతం తాను టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలపడం ఇందుకు బలాన్ని చేకూర్చింది. ఈ క్రమంలో గంభీర్‌ ఒక్కడే ఈ జాబ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. మంగళవారం ఇంటర్వ్యూకి అతడు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులైన అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరాంజపె, సులక్షణ నాయక్‌లు గంభీర్‌ను జూమ్‌ కాల్‌ ద్వారా ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం సహాయక సిబ్బందికి సంబంధించి.. గంభీర్‌ తన సొంత టీమ్‌ను ఎంచుకోనున్నట్లు సమాచారం.ద్రవిడ్‌తో పాటు వాళ్లంతా అవుట్‌!ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రం రాథోడ్, బౌలింగ్‌ కోచ్‌ పారస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్‌ టి.దిలీప్‌ల పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరందరికి ఉద్వాసన పలికి.. గౌతం గంభీర్‌ కొత్త వాళ్లను తన టీమ్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఫీల్డింగ్‌ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ పేరు వినిపిస్తుండగా.. మిగతా కోచ్‌లు ఎవరన్న అంశం చర్చనీయంగా మారింది.ఇదిలా ఉంటే.. సలీల్‌ అంకోలా స్థానంలో కొత్త సెలక్టర్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గంభీర్‌కు ఇంత వరకు కోచ్‌గా పనిచేసిన అనుభవం లేదు. అయితే, ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లకు మెంటార్‌గా వ్యవహరించాడు గంభీర్‌. తాజా సీజన్లో కోల్‌కతా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement