వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి  | Tdp Leaders Attacks On Ysrcp Activist Nandikotkuru | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి 

Jun 15 2019 7:57 AM | Updated on Jun 15 2019 7:58 AM

Tdp Leaders Attacks On Ysrcp Activist Nandikotkuru - Sakshi

సాక్షి, నందికొట్కూరు(కర్నూలు) :  కొనేటమ్మపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురువ రాజుపై అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచు, టీడీపీ నాయకుడు పోతుల రామిరెడ్డి దాడి చేశాడు. బ్రాహ్మణకొట్కూరు హెడ్‌కానిస్టేబుల్‌ తిమ్మప్ప తెలిపిన వివరాల మేరకు.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొనేటమ్మపల్లి గ్రామంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ వచ్చేందుకు రాజు ప్రయత్నించడంతో జీర్ణించుకోలేని  రామిరెడ్డి గురువారం దాడి చేసినట్లు బాధితుడి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.     

Advertisement
 
Advertisement
Advertisement