వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై తెలుగు తమ్ముళ్ల దాడి | TDP Followers attack YSRCP Followers | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై తెలుగు తమ్ముళ్ల దాడి

Aug 14 2015 3:10 PM | Updated on Aug 10 2018 9:42 PM

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారనే అనుమానంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు, కార్యకర్త ఇళ్లపై తెలుగు తమ్ముళ్లు రాళ్ల దాడికి పాల్పడ్డారు.

సైదాపురం (నెల్లూరు) : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారనే అనుమానంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు, కార్యకర్త ఇళ్లపై తెలుగు తమ్ముళ్లు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సైదాపురం మండలం దేవరవేమూరు గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.

టీడీపీ నాయకుడు శరత్, అతని అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఎ.ప్రసన్నకుమార్‌రెడ్డి, కార్యకర్త తిరుపతయ్య ఇళ్లపై రాళ్ల దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement