వివాహిత అనుమానాస్పద మృతి | Suspicious death of married woman in Prakasam district | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Dec 19 2017 7:34 AM | Updated on Dec 19 2017 7:34 AM

మాసాయిపేట (హనుమంతునిపాడు): మండల పరిధి క్రిస్టపల్లి పంచాయతీ మాసాయిపేట ఎస్సీ కాలనీకి చెందిన కోలా రవి భార్య రత్నకుమారి (21) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్‌ఐ యూ.హరిబాబు కథనం ప్రకారం..పొన్నలూరు మండలం భోగనంపాడుకు చెందిన రాజమ్మ కుమార్తె రత్నకుమారిని మేనమామ రవికి ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు. ఈ నేపథ్యంలో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫిట్స్‌ వచ్చి మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులకు భర్త సమాచారం అందించాడు. మృతురాలి సోదరుడు బి.ప్రభుదాసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. భర్త రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement