‘నారాయణ’ విద్యార్థుల ఆగ్రహం..! | Students Fires on Narayana College Owners in Kurnool | Sakshi
Sakshi News home page

నారాయణ కాలేజీలో విద్యార్థుల ఆందోళన..

Mar 11 2018 9:08 AM | Updated on Aug 21 2018 6:02 PM

Students Fires on Narayana College Owners in Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు: నారాయణ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కర్నూల్‌ జిల్లా నన్నూర్‌ నారాయణ కాలేజీలో చోటుచేసుకుంది. వివరాలివి.. హాస్టల్‌లో భోజనం సరిగా లేదని విద్యార్థులు తిరగబడ్డారు. కోపోద్రిక్తులై.. కాలేజీలోని ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. కాలేజీ యాజమాన్యం విద్యార్థులపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు క్యాంపస్‌ చేరుకుని విద్యార్థులను చితకబాదారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement