
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమం): వరుస పెళ్లిళ్ల నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్–కాకినాడటౌన్–నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్‌చార్జ్ పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–నర్సాపూర్ ప్రత్యేకరైలు (రైలు నెంబరు 07256) ఆగస్ట్ 14వ తేదీ సాయంత్రం 6.50కు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు 6 గంటలకు నర్సాపూర్ చేరుతుంది. నర్సాపూర్–హైదరాబాద్ ప్రత్యేకరైలు (07255) ఆగస్ట్ 15వ తేదీ రాత్రి 7.30కు నర్సాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50కు హైదరాబాద్ చేరుతుంది.
హైదరాబాద్–కాకినాడటౌన్ ప్రత్యేక రైలు (07001) ఆగస్ట్ 14, 17వ తేదీలలో రాత్రి 9.05కు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25కు కాకినాడ టౌన్ చేరుతుంది. కాకినాడటౌన్ –హైదరాబాద్ ప్రత్యేక రైలు (07002) ఆగస్ట్ 15, 19 తేదీలలో రాత్రి 9 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయని, ఈ అవకాశాన్ని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.