'పులిచింతల'ను సందర్శించిన సింగపూర్ బృందం | Singapore group to visit pulichinatala projcet | Sakshi
Sakshi News home page

'పులిచింతల'ను సందర్శించిన సింగపూర్ బృందం

Jun 24 2015 10:09 PM | Updated on May 29 2019 3:19 PM

రాజధానికి మంచి నీటిని అందించేందుకు కావలసిన జల వనరులను సమీక్షించేందుకు సింగపూర్ ప్రతినిధుల బృందం బుధవారం పులిచింతల ప్రాజెక్టును సందర్శించింది.

అచ్చంపేట(గుంటూరు జిల్లా): రాజధానికి మంచి నీటిని అందించేందుకు కావలసిన జల వనరులను సమీక్షించేందుకు సింగపూర్ ప్రతినిధుల బృందం బుధవారం పులిచింతల ప్రాజెక్టును సందర్శించింది. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు, స్లూయజ్‌ల ద్వారా బయటకు పోయే విధానం, క్రష్ట్‌గేట్ల పనితీరును పరిశీలించారు. ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకట రమణ నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

ఆవుట్ ప్లో, ఇన్‌ప్లోలను పరిశీలించారు. ప్రాజెక్టు సామర్థ్యాలను తెలుసుకున్నారు. ప్రాజెక్టును పరిశీలించిన వారిలో బృందం ప్రతినిధి వాక్‌యంగ్, సీఆర్‌డీఏ చీఫ్ ఇంజినీర్ కాశీవిశ్వేశ్వరరావు, ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణ, నీరుపారుదల సీఈ సుధాకర్ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement