బొబ్బిలిలో కాల్పుల కలకలం | Shots fired near bobbily in vizianagaram | Sakshi
Sakshi News home page

బొబ్బిలిలో కాల్పుల కలకలం

Apr 16 2017 10:24 AM | Updated on Sep 13 2018 5:22 PM

బొబ్బిలిలో కాల్పుల కలకలం - Sakshi

బొబ్బిలిలో కాల్పుల కలకలం

విజయనగరం జిల్లా బొబ్బిలిలో కాల్పుల కలకలం రేగింది.

బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలిలో కాల్పుల కలకలం రేగింది. మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న ఓ వ్యాపారీపై బీహార్‌కు చెందిన వ్యక్తి కాల్పులు జరిపాడు. బొబ్బిలికి చెందిన జగన్మహోన్‌రావు విశాఖపట్నంలో స్నేహసుధ చిట్‌ఫండ్‌ కంపెనీ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం జగన్మోహన్‌ మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా.. బీహార్‌కు చెందిన కేశవ్‌ అనే వ్యక్తి తుపకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో జగన్మోహన్‌కు తీవ్ర గాయాలు కావడంతో.. విశాఖపట్నానికి తరలించారు.

కాల్పుల శబ్ధంతో అప్రమత్తమైన వాకర్స్‌ నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే కాల్పులు జరిగాయనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement