సెప్టిక్ ట్యాంక్‌లోపడి ...... | septictank by mistake..... | Sakshi
Sakshi News home page

సెప్టిక్ ట్యాంక్‌లోపడి ......

Feb 14 2014 4:58 AM | Updated on Aug 21 2018 5:44 PM

సెప్టిక్ ట్యాంక్‌లోపడి ...... - Sakshi

సెప్టిక్ ట్యాంక్‌లోపడి ......

సెప్టింక్ ట్యాంక్‌పై ఉన్న దిమ్మె విరిగి మహిళ ట్యాంక్‌లో పడిన సంఘటన గురువారం లబ్బీపేట ఆర్ అండ్ బీ క్వార్టర్స్‌లో జరిగింది.

సెప్టిక్ ట్యాంక్‌లోపడి మహిళకు గాయాలు
 లబ్బీపేట, :
 సెప్టింక్ ట్యాంక్‌పై ఉన్న దిమ్మె విరిగి మహిళ ట్యాంక్‌లో పడిన సంఘటన గురువారం లబ్బీపేట ఆర్ అండ్ బీ క్వార్టర్స్‌లో జరిగింది. ట్యాంక్ ఖాళీగా ఉండటంతో ప్రమాదం తప్పి స్వల్పగాయాలతో ఆమె బయటపడింది. ట్యాంక్‌పై ఉన్న దిమ్మె శిథిలమైందని ఎన్నిసార్లు అధికారులు చెప్పినా పట్టించుకోలేదని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
 నగర పోలీస్ కమిషనరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే జి.బుచ్చయ్య పైడియ్యవీధి చివరలో బందరు కాలువ ఒడ్డున ఉన్న ఆర్ అండ్ బీ క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. అతడి తల్లి గంగాభవానీ(54) ఆయన వద్దే ఉంటోంది. ఉదయం క్వార్టర్  వెనుక భాగంలో ఉన్న గులాబీలు కోసేందుకు సెప్టిక్ ట్యాంక్ దిమ్మెపై నుంచి వెళ్తుండగా అది ఒక్కసారిగా విరిగింది. దీంతో ఆమె ట్యాంకులో పడింది. అది ఆరడగుల లోతు ఉండటంతో ఆమెకు గాయాలయ్యాయి. ట్యాంకులో ఎటువంటి వ్యర్థాలు, నీరు లేక పోవడంతో ప్రాణాపాయం నుంచి బయట పడిందని స్థానికులు చెబుతున్నారు. ఆమెను 108లో ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.  క్వార్టర్లు శిథిలావస్థకు చేరుతున్నాయని, మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement