నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ! | Sensex slips into Red | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ!

Jun 19 2014 1:07 PM | Updated on Sep 2 2017 9:04 AM

నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ!

నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ!

చమురు, ఆయిల్ రంగాల కంపెనీల షేర్లు పతనమవ్వడంతో 125 పాయింట్ల లాభంతో ఆరంభమైన సెన్సెక్స్ మధ్యాహ్న సమయానికి 115 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసుకుంది.

హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. చమురు, ఆయిల్ రంగాల కంపెనీల షేర్లు పతనమవ్వడంతో 125 పాయింట్ల లాభంతో ఆరంభమైన సెన్సెక్స్ మధ్యాహ్న సమయానికి 115 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇంట్రాడే ట్రేడింగ్ లో ఓ దశలో సెన్సెక్స్ 25,069 పాయింట్ల, నిఫ్టీ  7,502 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. 
 
మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి సెన్సెక్స్ 157 పాయింట్ల నష్టంతో 25089, నిఫ్టీ 46 పాయింట్ల తేడాతో 7511 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. 
 
ఓఎన్ జీసీ అత్యధికంగా 6.60 శాతం, యునైటెడ్ స్పిరిట్ 5.08, కోటాక్ మహీంద్ర 3.30, బీపీసీఎల్ 3.10, మారుతి సుజుకీ 2.22 శాతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. 
విప్రో, ఇన్పోసిస్, జిందాల్ స్టీల్, లుపిన్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement