నేటి అర్ధరాత్రి నుంచి ‘రెవెన్యూ’ సమ్మె | seemandhra Revenue employees to go on indefinite strike | Sakshi
Sakshi News home page

నేటి అర్ధరాత్రి నుంచి ‘రెవెన్యూ’ సమ్మె

Feb 5 2014 2:52 AM | Updated on Mar 23 2019 9:03 PM

సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ ఎన్జీవో సంఘం పిలుపు మేరకు.. జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని

 శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ ఎన్జీవో సంఘం పిలుపు మేరకు.. జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నారు. ఈ విషయాన్ని జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా ఆధ్యక్షుడు ఎం.కాళీప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీకాంత్‌లు మంగళవారం తెలిపారు. గురువారం నుంచి వీఆర్‌ఏ, వీఆర్‌ఓ నుంచి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగులంతా  పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొంటామన్నారు. సమ్మెకు అందరూ సహకరిం చాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement